హాలియాలో 144 సెక్షన్......
ఎస్ఐ సాయి ప్రశాంత్
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:09
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియాలో ఎన్నికల ప్రచారం సోమవారం
సాయంత్రం 5 గంటలకు ముగియగానే 144
సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ సాయి
ప్రశాంత్ తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు
మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, ఎవరూ
గుంపులుగా తిరగకూడదని ఆదేశించారు. సోషల్
మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన
చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు
ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు
సహకరించాలని ఆయన కోరారు.












