ప్రచారాన్ని ఉదృతం చేసిన మంజులనరసింహా గౌడ్
* 2వ వార్డ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పబ్బు రాజుగౌడ్
చౌటుప్పల్ ఫిబ్రవరి 09(ప్రజా గొంతుక)
చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డు కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి సుర్వి మంజుల నర్సింహ్మ గౌడ్ ప్రచారం లో పాల్గొన్న కాంగ్రేస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ ఈ సందర్భంగా ఓటర్లను కలిసి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ దేవేందర్ 2వ వార్డు ఇన్చార్జి నేలపట్ల సర్పంచ్ గంగాపురం వసంత నాగేష్ గౌడ్ ,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ బాలు మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదరి నర్సింహా,సంజీవరెడ్డి,యూత్ కాంగ్రేస్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.












