ప్రచారంలో దూసుకుపోతున్న 9 వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెల మోని మంగ విజయ్
*ప్రజా గొంతుక, ఫిబ్రవరి 8, డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
మునిసిపల్ ఎన్నికల ప్రచారం లో 9వార్డు కాంగ్రెస్ అభ్యర్థులు గెలమోని మంగ విజయ్ దూసుకుపోతున్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కౌన్సిలర్ గా వార్డు ప్రజల ప్రయోజనాలే పరమావధిగా వార్డు అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తానని, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మవద్దని, అభివృద్ధిని ఆశీర్వదించాలని కోరారు. గెలిచిన వెంటనే అర్హులైన వృద్ధులకు పింఛన్లు అలాగే తొమ్మిదవ వార్డులో సురక్షితమైన నీటి కోసం వాటర్ ప్లాంట్ ను మరియు దొంగల అధికంగా పడుతున్నారు కాబట్టి 9వ వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు, అలాగే కుక్కలు కోతులు నుండి రక్షణ కల్పిస్తానని వాగ్దానం చేశారు. వార్డు అభివృద్ధి కోసం అభివృద్ధి చేసే వారిని
ఎన్నుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.












