ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి పై వేటు.
ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలో ఈనెల 11న జరగబోయే రెండవ సాధారణ మున్సిపల్ఎన్నికలలో రెండో వార్డ్ లో నిలుచున్న కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కమలపురం రమేష్ ను నిన్న రాత్రి 11:30 నిమిషాల ప్రాంతంలో సస్పెండ్ చేసినట్లు సిద్దిపేట సిపి రష్మీ పెరుమాల్ ఉత్తర్వులు జారీచేశారు. వివరాల ప్రకారం పట్టణంలో రెండో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా కానిస్టేబుల్ రమేష్ భార్య బరిలో ఉంది. తన సతీమణి బరిలో ఉండటంతో మద్దతుగా రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు ఆధారాలతో సహా నిరూపించారు. ఇది ఇలా ఉండగా సిద్దిపేటలోని హెడ్ క్వార్టర్స్ లో డ్యూటీకి హాజరు కావాలని ఆదేశించినప్పటికీ ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రాకుండా క్రమశిక్షణ రహితాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి ప్రకారం 1964 లోని రూల్ 3 మరియు 5 సబ్ రూల్ 4 ప్రకారం నేరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ నియమావళి1991 ప్రకారం క్రమశిక్షణ బాధ్యతలు కమలాపురం రమేష్ ను సస్పెండ్ లో ఉండాలని పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు.












