15 వ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:08
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల
నేపథ్యంలో పట్టణంలో పలు రాజకీయ పార్టీలు
తమ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. ఈ
నేపథ్యంలో పట్టణంలోని 15 వ వార్డులో బిఆర్ఎస్
తన ప్రచార జోరును పెంచింది. 15వ వార్డు
డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమేష్,
ఇవాళ 15 వ వార్డు పరిధిలోని సప్తగిరి విలాస్
రెడ్డి కాలనీ, పద్మశాలి నగర్, జెడ్పి హైస్కూల్
ప్రాంతాలలో ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు.
కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని
ఓటర్లను కోరారు. తాను ఎల్లవేళలా అందుబాటులో
ఉంటానని అన్నారు. అదేవిధంగా యువకులతో
క్రికెట్ ఆడి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఈ
ప్రచారంలో ఆయన వెంట పలువురు నాయకులు
కార్యకర్తలు తదితరులు ఉన్నారు.












