*ప్రజలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయొద్దు: వద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 8 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
ప్రజలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయొద్దు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడి పిలువు. సర్వతోముఖాభివృద్ధి కేవలం కాంగ్రెస్
పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపోలు వీరమోహన్ స్పష్టం చేశారు. శనివారం దేవరకొండ పట్టణంలోని 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పున్న శైలజ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించిన ఆయన, పలు కీలక అంశాలను ప్రస్తావించారు.గత పదేళ్లుగా ప్రజల కష్టసుఖాలను పట్టించుకోని పార్టీలకు ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని, ప్రజల మధ్య ఉంటూ సేవ చేసే గుణం ఉన్న పున్న శైలజను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డులో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల వంటి ప్రజా అవసరాలు తీరాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. "శైలజ గెలిస్తే ఎమ్మెల్యే బాలు నాయక్ గారి సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి దేవరకొండను రాష్ట్రంలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












