8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గౌహార్ జబీన్ మజహర్ ఇంటిటి ప్రచారం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:08
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీలోని 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గౌహార్ జబీన్ మజహర్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రజాప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వార్డు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు.
హస్తం గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.












