ప్రచారానికి మిగిలింది 24 గంటలు మాత్రమే.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని 12 వార్డులకు ఈ నెల 11 జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఇంకా మిగిలింది 24 గంటలు మాత్రమే అని తెలుస్తోంది. ప్రచారానికి 24 గంటలు మాత్రం ఉండటంతో ఓటర్ల దగ్గరికి ఇంటింటికి వెళ్లి గల్లి గల్లి తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి చేతులతో నమస్కరించి మాకు ఓటు వేయమని వేడుకుంటున్నారు. 12 వార్డుల్లో నిలబడిన కౌన్సిలర్లు ఎవరికి ఓటు వేస్తారనేది తెలియక అయోమయంలో పడుతున్నారు. ఈనెల 13వ తేదీన ఎవరు కౌన్సిలర్లు గా గెలుస్తారనేది తేలనుంది












