రాంసాగర్ స్కూల్ ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ.
ప్రజా గొంతుక కొమురవెల్లి: మండలంలోని ఎంపీపీఎస్ రాంసాగర్ గ్రామంలో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ నిధుల కింద ఏడు లక్షల నిధులతో మంజూరైన ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అక్కినపల్లి రాజ్యలక్ష్మి మల్లారెడ్డి మాట్లాడుతూ మన పిల్లల భద్రత భవిష్యత్ కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేయడం నాకు ఎంతో సంతోషం, గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












