E-PAPER

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.

Date : 08 February 2026, 6:26 pm Posted By : PRAJA GONTHUKA

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.

పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి.

 ప్రజా గొంతుక చేర్యాల : రెండవ సాధారణ ఎన్నికల్లో ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కే. హైమావతి తెలిపారు. పట్టణంలోని ఆదివారం రోజున తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో, జూనియర్ కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ రోజు సిబ్బందికి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ అందించాలని పోలింగ్ సమయం ముగిసిన అనంతరం గురుకులంలో రిసెప్షన్ ప్రక్రియ సైతం సజావుగా జరపాలని ఆదేశించారు. రిసెప్షన్ పూర్తికాగానే బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములలో భద్రపరచాలని తెలిపారు. 13వ తేదీన కౌంటింగ్ ఉన్నందున 12వ తేదీన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు కౌంటింగ్ సిబ్బందికి ఏజెంట్లకు పరిమితంగా పాసులు అందజేయాలని ఆదేశించారు. ఏజెంట్లకు కౌంటింగ్ సిబ్బందికి వేరువేరుగా సెంటర్లో వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు వెబ్ కెమెరాలు ప్రతి ఒక్కటి రికార్డు కావాలన్నారు. మున్సిపాలిటీలో ఎన్నికలు సజావుగా పూర్తి చేసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్