అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
విజయలక్ష్మి దామోదర్ రెడ్డి
చౌటుప్పల్ ఫిబ్రవరి 08(ప్రజా గొంతుక)
చౌటుప్పల్ మున్సిపాలిటీ 14వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతల విజయలక్ష్మిదామోదర్ రెడ్డి గెలుపే లక్ష్యం గా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.విజయలక్ష్మి దామోదర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఒక్క అవకాశం ఇవ్వండి వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఉపసర్పంచ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షలు మందోళ్లగూడెం,బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.












