ఇంటికి నిప్పు పెట్టిన కేసులో నిందితుల అరెస్ట్
ప్రజా గొంతుక భీమారం మండల ప్రతినిధి: భీమారం మండలం లోని ధాంపూర్ గ్రామంలో ఎస్. సి కులానికి చెందిన వ్యక్తి ఇల్లు కాలబెట్టిన కేసులో నిందితుల అరెస్ట్
అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు:-
1. చెరుకు అంజి, తండ్రి : లక్ష్మణ్, వ.26 సం//లు, కులం : BC మంగళి, నివాసం ; ధాంపూర్ గ్రామం, భీమారం మండలం
2. సంపత్, తండ్రి : లక్ష్మణ్, వ.30 సం//లు, కులం : BC మంగళి, నివాసం ; ధాంపూర్ గ్రామం, భీమారం మండలం
3. చెరుకు లక్ష్మణ్, తండ్రి : పోషం, వ.55 సం//లు, కులం : BC మంగళి, నివాసం ; ధాంపూర్ గ్రామం, భీమారం మండలం.
నిందితుల వద్దనుండి స్వాదీనం చేసుకున్న సొత్తు వివరాలు;-
నేరంలో వాడిన రెండు గొడ్డళ్లు
వివరాలోకి వెళ్ళితే
ధాంపూర్ గ్రామం ని చెందిన జంగపల్లి సులేమాన్, తండ్రి : పెద్ద పోషం, వయస్సు 28 సం//, కులం . SC-మాదిగ, అదే గ్రామానికి చెందిన BC-మంగళి కులానికి చెందిన చెరుకు లచ్చయ్య కూతురు అయిన చెరుకు అంజలి, వయస్సు 20 సం. అను అమ్మాయిని ప్రేమించి నిన్న అనగా తేదీ. 06.02.2026 న ఉదయము సమయములో కరీంనగర్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి అట్టి అమ్మాయి అన్నయ్యలు చెరుకు అంజి, వ.30 స//లు, కులం : మంగళి, చెరుకు సంపత్, వ.30 స//లు, కులం : మంగళి, తండ్రి లచ్చయ్య, s/o పోషం, వ.55 సం//లు, కులం ; మంగళి గొడ్డళ్లు మరియు పెట్రోల్ పట్టుకుని జంగపల్లి పెద్ద పోషం ఇంటి వద్దకు వెళ్ళి మాదిగ కులానికి చెందిన వాడు మా అమ్మాయి నే తీసుకవేల్లి పెళ్లిచేసుకుంటాడా అని అరుస్తూ వాళ్ళని ఈరోజు చంపుడే అని సులేమాన్ ఇంటి వద్దకి వెళ్ళినారు, అట్టి సమయంలో వారి ఇంటివద్ద ఎవరు లేకపోవడంతో వారు ముగ్గురు జంగపల్లి పెద్ద పోషం ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో ఉన్న వస్తువులని గొడ్డళ్లతో పగలగొట్టి, వారి వెంట ప్లాస్టిక్ బాటిల్ లో తీసుక వెళ్ళిన పెట్రోల్ ని ఇంట్లో వస్తువులపై పోసి నిప్పు పెట్టినారు. తర్వాత ఇంట్లో మంటలు లేచి, ఇల్లంతా మంటల్లో కాలిపోయింది. దీనివల్ల ఇంటి యజమాని జంగపల్లి పెద్దపోషం కి ఆస్తి నష్టం జరిగినది. ఇట్టి విషయం పై జంగపల్లి పెద్ద పోషం పిర్యాదు మేరకు భీమారం పోలీస్ స్టేషన్ లో ఈరోజు అనగా తేదీ 07.02.2026 న కేసు నమోదు అయినది.
ఇట్టి కేసు ని జైపూర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, శ్రీ. వేంకటేశ్వర్ గారు దర్యాప్తు చేసి, ఈరోజు నిందితులని అవుడం x రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు లో హాజరు చేయడం జరుగుతుందని
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు.












