ఆశీర్వదించి గెలిపించండి వార్డ్ అభివృద్ధికి కృషి
*గోపయ్య చారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా*
*46వ బిజెపి వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక*
ప్రజా గొంతుక న్యూస్, సూర్యాపేట:ప్రజలు ఆశీర్వదిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 46వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక అన్నారు. వార్డు ప్రజలు స్థానికత చూసి, నిత్యం ప్రజల మధ్య ఉంటూ... ప్రజల సేవకు పాటుపడుతున్న వ్యక్తులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. మా నాన్న పోలోజు గోపయ్య చారి 1998లో కార్గిల్ యుద్ధంలో దేశ సేవకై అమరుడయాడని ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు సొంత ఖర్చులతో కనెక్టివ్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తానని తెలిపారు. ప్రజలు సేవ చేసేవారికి పట్టం కట్టాలని కోరారు. గత పది సంవత్సరాల నుంచి వార్డు సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని అన్నారు. మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












