మున్సిపల్ ఎన్నికలకై పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
ప్రజా గొంతుక డెస్క్ (ఫిబ్రవరి 07)
పగడ్బందీ ఏర్పాట్ల నడుమ మున్సిపల్ ఎన్నికలు విజయవంతం చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ 11వ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయములో అధికారులతో సమావేశనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యలపై సంబందిత పోలీస్ అధికారుల వివరణనిచ్చారు. ఈ సమావేశం లో ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, కౌంటింగ్ రోజున చేపట్టిన పోలీస్ బందోబస్తు వివరాలను కూడా పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను అక్రమ మద్యం మద్యం కట్టడి చేయడంతో పాటు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా అందించే తాయిలాలపై పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని, ఎవరైనా, ఎక్కడైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వుండాలని బ్యాలెట్ పత్రాల పంపిణీ, ఎన్నికల రోజున, చివరగా కౌంటింగ్ రోజున పెద్ద సంఖ్యలో బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని, సంబంధిత ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేయాలని ఎన్నికల వేళ ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, పోలీస్ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సీపీ తెలిపారు. ఈ సమావేశం డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ఏ.ఎస్పీలు శుభం, చేతన్, టైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర తో పాటు ఏసీపీలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు












