హలియా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో
పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన కౌన్సిలర్ అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని 11 వార్డుల అభ్యర్ధులు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కుకుడాల ఆంజనేయులు మాట్లాడుతూ పద్మశాలిలు ఐక్యతను చాటి చెప్పే సమయం ఇదేనని ప్రతీ వార్డులో 80 నుంచి 90 ఓట్లు దాదాపు మున్సిపాలిటీలో 900 వరకు పద్మశాలిల ఓట్లు ఉన్నాయని అవన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధుల చెయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన కుల బలం చూపించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ డి సి సి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా పద్మశాలిలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని అందులో భాగంగా తనకు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కీలకమైన పదవిని ఇచ్చారని. హాలియా మున్సిపాలిటీలో 9వ వార్డు అభ్యర్థిగా చేరుపల్లి ముత్యాలకు అవకాశం కల్పించారని ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మశాలి ఓటర్లు ఐక్యంగా పనిచేసి గెలిపించాలని విన్నవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ హాలియా ఏర్పడ్డపటి నుంచి పట్టణ అభివృద్ధిలో అన్నీ రకాలుగా పద్మశాలిలు ముందుంటున్నారు వారికి రాజకీయంగా, ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద పీట వేస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుంది అని కావున ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 11 వార్డుల అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాకునూరి నారాయణ గౌడ్, టి పి సి సి జెన్ ఎస్ ఇ సి కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు
సబాధ్యక్షత కుకుడాల బాలకృష్ణ నేత వహించగా, సంఘం కార్యవర్గం గడ్డం రమణయ్య , నామని సుధాకర్, కొంగరి రమణయ్య, కొంగరి శ్రీను, రవి, వాసు, గద్దె నాగరాజు, నారాయణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి కుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం….










