E-PAPER

పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

Date : 07 February 2026, 4:18 pm Posted By : PRAJA GONTHUKA

పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

ప్రజా గొంతుక చేర్యాల : ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా సిద్ధిపేట సిపి రష్మీ పెరుమాళ్ అదేనుసారము పోలీసులు శనివారం చేర్యాల మున్సిపాలిటీ కేంద్రంలో దాదాపు 100 మంది పైగా పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు హుస్నాబాద్ ఏసిపి సదానందం తెలిపారు. ఈనెల 11వ తేదీన జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో స్థానిక ఓటర్లలో భద్రత భావం కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా ఉండాలని కోరారు.ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కువినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు కూడా చాలామంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఈ ఫ్లాగ్ మార్చ్ దృశ్యాన్ని తమ తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించ డంలో పోటీ పడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ నాయక్, ఎస్సై వేముల నవీన్ ను ఏసిపి సదానందం అభినందించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్