12 వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్....
-12 వార్డు అభివృద్ధికి కృషి చేస్తా : వంగ ఉమ యుగంధర్
అడుగడుగునా అధికార పార్టీ అభ్యర్థికి స్వాగతం పలుకుతున్న ప్రజలు...
ప్రజా గొంతుక జనగామ మున్సిపాలిటీ..
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వంగ ఉమ యుగందర్ ఓటర్లను అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 12వ వార్డులో గడపగడపకు తిరుగుతూ ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనువివరించారు.మహిళలకు ఆర్థిక భద్రత, పేదలకు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. ఈ పథకాలు నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే 12వ వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, వీధిదీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే కౌన్సిలర్‌గా పనిచేస్తూ, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.ఒకసారి అవకాశం ఇవ్వండి అని ఇస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్లగొనిబాలకిషన్ గౌడ్, బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు, గోపాల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గణపురం నాగేష్, గుట్ట డైరెక్టర్ వల్లాల సత్యనారాయణ,మాజీ ఎంపీపీ వేముల బాలరాజు,మంగళపల్లి కృష్ణమూర్తి ,బొడిగమ్ వెంకటరెడ్డి, భేతీ కృష్ణమూర్తి అమృతా రెడ్డి, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.












