*భక్తుల కోర్కెలు తీర్చే షర్ పుద్దీన్ బాబా దర్గా*
*పహాడీషరీఫ్ దర్గా 760 ఉర్సు ఉత్సవాల్లో కిచ్చెన్న*
*అల్లాకు గంధం సమర్పించిన కేఎల్ఆర్ కు ఘన స్వాగతం*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఫిబ్రవరి 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో కేఎల్ఆర్ మాట్లాడుతూ..భక్తుల కోర్కెలు తీర్చే షర్ పుద్దీన్ బాబా దర్గా 760 ఉర్సు ఉత్సవాలకు భారీగా ముస్లిం సోదరులు హాజరయ్యారు.
ఖుత్తుబుల్ ఆఫ్తాబ్ సుల్తానుల్ట్ ఆరిఫిన్... హజరత్ సయ్యద్ న బాబా షర్ పుద్దీన్... సోహార్వర్ది రహమతుల్లా అలై గారి 760 ఉర్సు షరీఫ్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
పహాడీషరీఫ్ దర్గాను సందర్శించి గంధం సమర్పించారు కిచ్చెన్న.
దర్గా ముజావర్లు, మతపెద్దల ఆశీస్సులు తీసుకున్నారు కేఎల్ఆర్
కోరిన కోర్కెలు తీర్చే బాబా షర్ పుద్దీన్ దర్గాకు పేరుందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు.
శాంతి సామరస్యం వెల్లివిరుస్తుందని ముస్లిం సోదరులు గొప్ప పండుగ వాతావరణంలో 760 ఉర్సు ఉత్సవాలు జరుపుకోవటం సంతోషమన్నారు కిచ్చెన్న
దర్గా ఉత్సవాలకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రూ.21 లక్షలు కేటాయించారని కేఎల్ఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని మతాలు, కులాల పండుగలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమానంగా చూస్తుందని లక్ష్మారెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా కేఎల్ఆర్ కు ఘన స్వాగతం పలికారు మైనార్టీ సోదరులు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అబ్దుల్లా బినావత్, పహాడీషరీఫ్ నేత, మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్, మైనార్టీ నాయకులు జహంగీర్, యూసుఫ్ ఖాద్రీ, జంగయ్య సహా పలువురు కాంగ్రెస్, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.












