పది గంటల్లోనే చైన్ దొంగతనం కేసును చేదించిన చేర్యాల పోలీసులు.
ప్రజా గొంతుక చేర్యాల : మండలంలోని చుంచనకోట గ్రామానికి చెందిన గాలమ్మ(68) అనే వృద్ధురాలి మెడలో నిన్న ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు తెరిచి ఉండటంతో నిందితుడు లోపలికి వెళ్లి మీకు కూతురు అరటిపండ్లు ఇవ్వమని చెప్పడంతో గాలమ్మ నిజమేనని నమ్మి తాగడానికి కొన్ని మంచి నీళ్లు అడిగాడు. నీళ్ల కోసం వంటింట్లోకి వెళ్లడం చూసిన నిందితుడు ఆమె మెడలో నుంచి 27 గ్రాముల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కుని వెళ్లి పారిపోయాడు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చేర్యాల పోలీసులు ఆధారాలు సేకరించి చేర్యాల పట్టణానికి చెందిన ఆరే పల్లీ వంశీకృష్ణగా (26) గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి దొంగలించిన పుస్తెలతాడును స్వాధీనం చేసుకొని గురువారం రోజున రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసీపీ సదానందo మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మెడలో నుంచి దొంగతనం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మహిళలు ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని, గ్రామాల్లో సీసీ కెమెరాల నిఘా తక్కువ ఉండటంవల్ల ఇలాంటి దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారుతుందని అన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గరికివచ్చినప్పుడు వారిని లోపలికి రానివ్వకుండా చూసుకోవాలన్నారు. అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్, కొమురవెల్లి ఎస్ఐ.తోట మహేష్, మద్దూర్ ఎస్సై. ఆసిఫ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












