*-ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యండి అభివృద్ధి ఏంటో చూపిస్త.*
*-14 వ వార్డ్ బిఎస్పీ అభ్యర్థి కోళ్ల హుసేన్*.
గద్వాల జిల్లా కేంద్రం లో బహుజన సమాజ్ పార్టీ 14 వ వార్డ్ అభ్యర్తి కోళ్ల హుసేన్ మాట్లాడుతూ...చాలా కాలం నుండి అగ్రకుల పార్టీ లకు ఓట్లు వేసుకుంటూ పోతున్నారు తప్ప 14 వ వార్డ్ గంజి పేట అభివృద్ధి కాలేదు అని ఆయన అన్నారు. అలాగే బీజేపీ,కాంగ్రెస్,బిఅర్ఎస్ వాళ్ళు 5 సంవత్సరాల ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. మరియువారి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అని కోళ్ల హుసేన్ 14 వ వార్డ్ ప్రజలను కోరారు.బడుగు బలహీన వర్గాల, ఈ దేశ బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బిఎస్పీ పార్టీ అయిన ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక ఓట్లతో గెలిపించండి అని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మాణికుమార్,బి ఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.












