*జయముఖి ఇంజినీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం* ఘనంగా నిర్వహణ.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి వి. విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్ ) , 05 ఫిబ్రవరి 2026.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం , స్థానిక జయముఖి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజికల్ సైన్స్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్ ) మరియు రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో తేది 05-02-2026 గురువారం రోజు రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమన్ని కళాశాల జాయింట్ సెక్రటరీ శ్రీ టీ వి ఆర్ ఎన్ రెడ్డి , ట్రెజరర్ శ్రీ శంకర్ రెడ్డి , రెడ్ క్రాస్ అండ్ లయన్స్ క్లబ్ హనంకొండ శ్రీ రమేష్, ప్రభాకర్, కృష్ణ మూర్తి,పురుషోత్తం లు ప్రారంభించి రక్తదానం మహత్తరమైన సామాజిక సేవ అని విద్యార్థులకు సూచించారు.
“రక్తదానం ప్రాణదానం” అని, యువత సామాజిక బాధ్యతగా రక్తదానంలో పాల్గొనాలని కోరారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు శిబిర నిర్వహణకు సహకరించి, పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపి, విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి సేవ చేయగలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కళాశాల యాజమాన్యం శ్రీ టీ వి ఆర్ ఎన్ రెడ్డి వెల్లడించింది. ఈ శిబిరంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మొత్తం సుమారు 250 యూనిట్ల రక్తం సేకరించబడింది. డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ , రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు, అపోహలు, ఆరోగ్య జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం శ్రీ టివిఆర్ఎన్ రెడ్డి, శ్రీ శంకర్ రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపాల్ వాసుదేవ మూర్తి, అనిల్, ఇంజనీరింగ్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ శ్రీనివాస్ రావు గారు, డీన్ అఫ్ అకాడమిక్ ఎండి హమ్మద్ పాషా, వివిధ విభాగల ఆధిపతులు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ సతీష్ , సందీప్ , రెడ్ క్రాస్ సొసైటీ ఎంప్లాయిస్, లయన్ క్లబ్ మెంబెర్స్ మరియు ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.











