కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన కర్ణ నర్సిరెడ్డి....
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:04
నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, అనుముల మండలం, హాలియాకు చెందిన కర్ణ నర్సిరెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
వీరితో పాటు హాలియా పట్టణం 7 వార్డుకు చెందిన చిట్టీపోలు నాగార్జున బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.
పార్టీలో చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి పార్టీ లోనికి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, హాలియా పట్టణం ఎన్నికల సమన్వయకర్త తిప్పన విజయ సింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి , సాదం సంపత్ కుమార్
ఈ కార్యక్రమంలో పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోరేపెల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వర్ర వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ పొదిల్ల శ్రీనివాస్, సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి, చిట్టిపోలు శ్రీనివాసులు,కురాకుల రవి, రావులపాటి ఎల్లయ్య, మధుసూదనా చారి, రిక్కల అచ్చిరెడ్డి,జింకల లింగయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.












