శిథిలావస్థలో కోటగడ్డ మండల ప్రాథమిక పాఠశాల...
విద్యార్థుల భద్రతపై ఆందోళన..
ప్రజాగొంతుక భీమదేవరపల్లి:-
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామం కోటగడ్డ మండల ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులు, ఉపాధ్యాయులు భయభ్రాంతుల మధ్యనే చదువులు కొనసాగిస్తున్నారు.
పాఠశాల భవనం పైకప్పు ఎప్పుడు కూలిపోతుందో అన్న ఆందోళనతో ఉపాధ్యాయులు విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చోబెట్టలేని పరిస్థితి నెలకొంది. భవనం భద్రతపై నమ్మకం లేకపోవడంతో పాఠశాల వరండాల్లోనే పిల్లలను కూర్చోబెట్టి బోధన కొనసాగిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి, శిథిలావస్థకు చేరుకున్న ఈ పాఠశాల భవనాన్ని తొలగించి నూతన భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..

విద్యార్థుల భద్రతపై ఆందోళన..










