వరసిద్ధి వినాయక కల్యాణ మహోత్సవం
చౌటుప్పల్(ప్రజా గొంతుక):
చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పరిధిలోని నేషనల్ హైవే ని ఆనుకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక దేవస్థానము నందు బుధవారం ఉదయము 7:00గంటలకు స్వామివారి అభిషేకము మరియు 9 :00 గంటలకు హోమము సాయంత్రము శ్రీ గణపతి వ్రతము నిర్వహించడం జరుగుతుందని దేవాలయ కమిటీ వారు తెలిపారు అలాగే 05/02/2026 నాడు ఉదయం 10 గంటలకు స్వామివారి *కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిచబడునని తదననంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమం దాతలచే నిర్వహించబడుతుందని కావున ఇట్టి కార్యక్రమముకు భక్రులు కుటుంబ సమేతంగా దేవాలయం వద్దకు వచ్చి స్వామివారి ఆశీర్వాదము ఆశీస్సులను తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులు కాగలరని దేవాలయ కమిటీ వారు తెలియజేశారు.












