ప్రచార హోరు 13వ వార్డులో కాంగ్రెస్ జోరు
ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులో బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్
వారి కులదైవమైన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని
పెద్ద సంఖ్యలో మహిళలతో పార్టీ శ్రేణులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలను చేతి గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజల కోసం పాలకురాలిగా కాకుండా సేవకురాలిగా పనిచేస్తానని వార్డు ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు.












