E-PAPER

2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తి

Date : 04 February 2026, 6:27 pm Posted By : PRAJA GONTHUKA

2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తి

2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:04

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా

తేదీ : 04.02.2026

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు మరియు జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్, నల్గొండ సూచనల మేరకు, 2026 సంవత్సరానికి నిర్వహించబడుతున్న 2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా, హాలియా మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు ఈ విధంగా చేయబడినట్లు ప్రజలకు తెలియజేయడమైనది.

ఎన్నికల నిర్వహణకు గుర్తించబడిన కేంద్రాలు :

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ & రిసెప్షన్ సెంటర్ :

ప్రభుత్వ ఐటీఐ కళాశాల, హాలియా

పోలింగ్ రోజు తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ :

ప్రభుత్వ ఐటీఐ కళాశాల, హాలియా

కౌంటింగ్ సెంటర్ & శాశ్వత స్ట్రాంగ్ రూమ్ :

అవంతీపురం మార్కెట్ యార్డు, మిర్యాలగూడ

పోలింగ్ అనంతర భద్రతా ఏర్పాట్లు :

పోలింగ్ పూర్తైన అనంతరం, అన్ని బ్యాలెట్ బాక్సులు మరియు ఇతర చట్టబద్ధ ఎన్నికల సామగ్రి

మొదటగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల, హాలియాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చబడతాయి.

తదనంతరం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల ప్రకారం,

పూర్తి పోలీస్ బందోబస్తు, క్లోజ్డ్ వాహనాల ద్వారా,

ఈ ఎన్నికల సామగ్రి మిర్యాలగూడలోని అవంతీపురం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన

శాశ్వత స్ట్రాంగ్ రూమ్ (కౌంటింగ్ సెంటర్)కు సురక్షితంగా తరలించబడుతుంది.

ఈ అన్ని ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ సూచనలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలు, భద్రతా అంశాలు మరియు పరిపాలనా సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకొని చేయబడినవని ప్రజలు గమనించగలరు.

ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సహకరించవలసిందిగా కోరడమైనది.

జారీ చేసిన వారు :

అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి &

మున్సిపల్ కమిషనర్

హాలియా మున్సిపాలిటీ

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్