*పార్థివ దేహానికి నివాళులర్పించిన సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్
మల్దకల్ మండల్ న్యూస్:
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కేంద్రంలోని మంగళవారం కుమ్మరి పుల్లన్న అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్దకల్ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్ కుమ్మరి పుల్లన్న పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. వీరి వెంట 6 వార్డు జే ఆనందు, శీను, బాలు, అమృత్, నాగప్ప, కృష్ణమూర్తి, బుస్కరాజ్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు.












