*యంగ్ రైటర్స్ మిలన్ కు పడిదం రాజేందర్ ఎంపిక* .
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 03 ఫిబ్రవరి 2026.
హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రక్కన , పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ ప్రాంగణంలో జరిగే కొత్తతరం కవుల మిలన్ కు అక్కడ చెడ గ్రామానికి చెందిన యువ కవి గాయకుడు పడిదం రాజేందర్ ఎంపిక కావడం జరిగింది. ఫిబ్రవరి 7,8 తేదీలలో రెండు రోజులు జరిగే ఈ వర్క్ షాప్ కు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 40 మంది సెలెక్టెడ్ కవులలో పడిదం రాజేందర్ ఉండడం ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఉద్దేశించి పడిదం రాజేందర్ మాట్లాడుతూ, సమాజ మార్పు కోసం బహుజన సిద్ధాంతంకై నాకలంలోని సిరా అనునిత్యం నిజాయితీగా పనిచేస్తుందని, పాటలు,కథలు,కవితలు, వ్యాసాల రూపంలో సమాజాన్ని మేలుకొలుపుతానని, నన్ను ఎంపిక చేసిన మేధావులకు, సీనియర్ కవులందరికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్, జిలుకర శ్రీనివాస్, కవయిత్రి మెర్సీ మార్గరెట్, స్కైబాబా,పేర్ల రాము,హాథిరాం సభావట్, కవి యాకుబ్, తగుళ్ల గోపాల్, జి లక్ష్మీనారాయణ సంఘీశెట్టి శ్రీనివాస్ జూపాక సుభద్ర బండారి రాజ్ కుమార్ చల్లపల్లి స్వరూప రాణి ఎం.వినోదిని, కోయి కోటేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, వనపట్ల సుబ్బయ్య తదితరులు హాజరుకానున్నారు.












