E-PAPER

*చెన్నారావుపేట మండలంలో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ టోర్నమెంట్.* .

Date : 03 February 2026, 3:21 pm Posted By : PRAJA GONTHUKA

*చెన్నారావుపేట మండలంలో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ టోర్నమెంట్.* .

*చెన్నారావుపేట మండలంలో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ టోర్నమెంట్.* .

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 03 ఫిబ్రవరి 2026.

గ్రామీణ క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ దోహదం చేస్తుంది - చెన్నారావుపేట మండల స్పెషల్ అధికారి డాక్టర్ బాలకృష్ణ.

శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది - తహసిల్దార్ అబిద్ అలీ.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ , 03 ఫిబ్రవరి 2026 తేదీన చెన్నారావుపేటలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట సాయి శివానంద్ అధ్యక్షతన జరిగిన క్రీడా పోటీలలో ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి డాక్టర్ బాలకృష్ణ ,మండల తహసిల్దార్ అబిద్ అలీ, ఎంఈఓ బైరి సరళ పాల్గొన్నారు.ఉప్పరపల్లి ,చెన్నారావుపేట ,పాపయ్యపేట జల్లి,అమీనాబాద్ ఐదు క్లస్టర్లు కలిపి మండల స్థాయి మహిళలు మరియు పురుషుల విభాగంలో కోకో, కబడ్డీ ,వాలీబాల్ అథ్లెటిక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పెషల్ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ శారీరక వ్యాయామానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ టోర్నమెంటు దోహదపడుతుందని తెలిపారు. తహసిల్దార్ అబిద్ అలీ మాట్లాడుతూ ప్రతినిత్యం యువతీ యువకులు కనీసం గంటసేపైనా వ్యాయామం ,ఆటల్లో పాల్గొనాలని, శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యము బాగుంటుందన్నారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది క్రీడాకారులు మండల స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు వీరగొని స్వప్న, బిక్షపతి , మంజుల ,నరసింహ రాములు, రమేష్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ జట్ల మధ్య ఆసక్తికరంగా పోరుకొనసాగింది.

⬇ DOWNLOAD
×

*చెన్నారావుపేట మండలంలో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ టోర్నమెంట్.* .

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 03 ఫిబ్రవరి 2026.

గ్రామీణ క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ దోహదం చేస్తుంది – చెన్నారావుపేట మండల స్పెషల్ అధికారి డాక్టర్ బాలకృష్ణ.

శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది – తహసిల్దార్ అబిద్ అలీ.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ , 03 ఫిబ్రవరి 2026 తేదీన చెన్నారావుపేటలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకట సాయి శివానంద్ అధ్యక్షతన జరిగిన క్రీడా పోటీలలో ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి డాక్టర్ బాలకృష్ణ ,మండల తహసిల్దార్ అబిద్ అలీ, ఎంఈఓ బైరి సరళ పాల్గొన్నారు.ఉప్పరపల్లి ,చెన్నారావుపేట ,పాపయ్యపేట జల్లి,అమీనాబాద్ ఐదు క్లస్టర్లు కలిపి మండల స్థాయి మహిళలు మరియు పురుషుల విభాగంలో కోకో, కబడ్డీ ,వాలీబాల్ అథ్లెటిక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పెషల్ అధికారి బాలకృష్ణ మాట్లాడుతూ శారీరక వ్యాయామానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీయడానికి సీఎం కప్ టోర్నమెంటు దోహదపడుతుందని తెలిపారు. తహసిల్దార్ అబిద్ అలీ మాట్లాడుతూ ప్రతినిత్యం యువతీ యువకులు కనీసం గంటసేపైనా వ్యాయామం ,ఆటల్లో పాల్గొనాలని, శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యము బాగుంటుందన్నారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది క్రీడాకారులు మండల స్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు వీరగొని స్వప్న, బిక్షపతి , మంజుల ,నరసింహ రాములు, రమేష్ క్రీడా పోటీలను నిర్వహించారు. వివిధ జట్ల మధ్య ఆసక్తికరంగా పోరుకొనసాగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్