E-PAPER

క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Date : 03 February 2026, 3:18 pm Posted By : PRAJA GONTHUKA

క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

డాక్టర్ ప్రభుదయాల్

​అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు రాత సామాగ్రి పంపిణీ

ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి 3 కొత్తగూడెం

విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ బతుకులను మార్చుకోవాలని కొత్తగూడెం మాజీ మండల విద్యాశాఖ అధికారి (MEO) డాక్టర్ ప్రభుదయాల్ అన్నారు. కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (URS)లో ఎంపిక చేసిన నిరుపేద విద్యార్థులకు ఆయన స్వయంగా రాత సామాగ్రిని అందజేశారు.అక్షరమే ఆయుధం ​ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. లోకంలో అన్నింటికంటే గొప్ప సంపద 'చదువు' మాత్రమేనని గుర్తుచేశారు. విద్యార్థులు తమ రాత నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో పలకలు, బలపాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని అక్షరాస్యతలో రాణించాలని ఆకాంక్షించారు.

⬇ DOWNLOAD
×

క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

డాక్టర్ ప్రభుదయాల్

​అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు రాత సామాగ్రి పంపిణీ

ప్రజా గొంతుక న్యూస్ ఫిబ్రవరి 3 కొత్తగూడెం

విద్య ద్వారానే పేదరికం తొలగిపోతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ బతుకులను మార్చుకోవాలని కొత్తగూడెం మాజీ మండల విద్యాశాఖ అధికారి (MEO) డాక్టర్ ప్రభుదయాల్ అన్నారు. కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల (URS)లో ఎంపిక చేసిన నిరుపేద విద్యార్థులకు ఆయన స్వయంగా రాత సామాగ్రిని అందజేశారు.అక్షరమే ఆయుధం ​ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. లోకంలో అన్నింటికంటే గొప్ప సంపద ‘చదువు’ మాత్రమేనని గుర్తుచేశారు. విద్యార్థులు తమ రాత నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో పలకలు, బలపాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని అక్షరాస్యతలో రాణించాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్