ఉచిత పశువైద్య శిబిరానికి అపూర్వ స్పందన.
ప్రజ గొంతుక (పిబ్రవరి 03)కాల్వ శ్రీరాంపూర్ : మానవాళి మనుగడలో పశువులు సమృద్ధి అవసరం సర్పంచ్ తుల.మొట్లపల్లి లోని ఉచిత పశువైద్య శిబిరానికి అపూర్వ స్పందన. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మోట్లపల్లి గ్రామంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం 2025 -2026 సంవత్సరంలో భాగంగా ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తుల మనోహర్ రావు రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించారు. నిపుణులైన అధ్యాపక బృందం, నిష్ణాతులైన పశువైద్యలు, వైద్య విద్యార్థులుతో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువుల కాపరులకు ఉచిత మందులు పంపిణీ చేశారు, పశువులకు గర్భ కోశా వ్యాధి నివారణ చికిత్సలు, దూడలకు నట్టలు నివారణ మందులు పంపిణి, పశుపోషణ సంరక్షణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద రాతుపల్లి పశువైద్యాధికారి డాక్టర్ శైలజ, పశువైద్య డాక్టర్లు ప్రతీప్ రెడ్డి, దీపిక,నీరజ, ప్రణయ్, పండిత్ రెడ్డి, గొర్రెల మేకల సొసైటీ అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్, తదితర డాక్టర్లు పాల్గొన్నారు.