మున్సిపాలిటీలో బీజేపీ గెలుపు దిశగా కీలక అడుగు –30 మంది అభ్యర్థులకు బీ - ఫామ్ విడుదల.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 02 ఫిబ్రవరి 2026.
నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో *బిజెపి* వైపు ప్రజల చూపు.
- రావు పద్మ మున్సిపల్ ఎన్నికల ప్రచారం .
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30మంది బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ - ఫారమ్స్ ను *బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్ర రావు* అధికారికంగా విడుదల బీఫాములను ఈరోజు భారతీయ జనతా పార్టీ నర్సంపేట కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ప్రబారి *శ్రీ రావు పద్మ , వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి , కాంటెస్ట్ అభ్యర్థి కంభం పార్టి పుల్లారావు* ల చేత 30 మంది అభ్యర్థులకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సంపేట మున్సిపాలిటీపై బీజేపీ పట్టు మరింత బలపడుతుందన్న విశ్వాసం వ్యక్తమైంది.
30 కి 30 వార్డులలో పోటీకి సిద్ధమైన బిజెపి అభ్యర్థులు
అనంతరం వారు మాట్లాడుతూ,
*మున్సిపల్* ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అర్థం కాక అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) వైపే కేంద్రీకృతమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం, అభివృద్ధి కేంద్రంగా పాలన, అవినీతికి తావులేని విధానాలతో బిజెపి ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, రోడ్లు, తాగునీరు, భద్రత వంటి అంశాలపై బిజెపి ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీల పనితీరుపై నిరాశ చెందిన ప్రజలు, ఒక నమ్మదగిన ప్రత్యామ్నాయంగా బిజెపిని చూస్తున్నారు. పట్టణాల అభివృద్ధికి కొత్త దిశ చూపగల శక్తి బిజెపికే ఉందన్న నమ్మకం ప్రజల్లో బలపడుతోంది.
మొత్తంగా చూస్తే, ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా మారనున్నాయని, ప్రజలు ఈసారి బిజెపికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు
ఈ కార్యక్రమం లో... రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షుల గూడూరు సందీప్ రూరల్ అధ్యక్షులు తనువుల అంబేద్కర్ మరియు 30 వార్డులో పోటీ చేసే అభ్యర్థులు, బిజెపి సీనియర్ నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.












