నాగపూర్ నుంచి కరీంనగర్‌కు గంజాయి తరలింపు – ఇద్దరు అరెస్ట్
ప్రజా గొంతుక పెద్దపల్లి ప్రతినిధి: ఇరుకుల్ల వీరేశం
పెద్దపల్లి కేంద్రంలో సోమవారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. నాగపూర్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి కొనుగోలు చేసి, ఇతరులకు అధిక ధరకు అమ్మేందుకు ఆటోలో కరీంనగర్‌కు వెళ్తున్న ఇద్దరు యువకులను పెద్దపల్లి కలెక్టరేట్ సమీపంలో పట్టుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ఖాజా బషిరుద్దిన్ (24), షోయబ్ అక్తర్ (23)గా గుర్తించారు. వీరు గంజాయి సేవనానికి, జల్సాలకు అలవాటుపడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువైన 807.52 గ్రాముల ఎండు గంజాయిని, బజాజ్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.












