E-PAPER

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు స్లిప్పులు అందజేయాలి

Date : 02 February 2026, 2:29 pm Posted By : PRAJA GONTHUKA

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు స్లిప్పులు అందజేయాలి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు స్లిప్పులు అందజేయాలి.....

మున్సిపల్ కమిషనర్

హాలియా

నల్గొండ జిల్లా ప్రతినిధి/ సేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:02

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ,

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీపై అవగాహన కల్పించేందుకు ఈరోజు హాలియా మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించబడినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ సూచనల మేరకు,

02.02.2026 నుండి హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రారంభించబడినట్లు సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని కమిషనర్ స్పష్టం చేశారు.

అదేవిధంగా, ఈరోజే బూత్ లెవల్ ఆఫీసర్లు తో ప్రత్యేక సమావేశం నిర్వహించి,

ప్రతి అర్హులైన ఓటరుకు ఫోటో ఓటర్ స్లిప్ తప్పనిసరిగా అందేలా చూడాలని

పంపిణీ ప్రక్రియను క్రమబద్ధంగా, సమయపాలనతో పూర్తి చేయాలని

బిఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీకి చివరి తేదీ 07.02.2026 అని, నిర్ణీత గడువులోపు అన్ని అర్హులైన ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమకు కేటాయించిన ఫోటో ఓటర్ స్లిప్పును తప్పనిసరిగా స్వీకరించి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోరారు.

ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు ఎన్నికల విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు స్లిప్పులు అందజేయాలి…..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :