రైల్లో ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. ..ఎదురుగా వయస్సు పైబడినపెద్దావిడ, ఆపక్కనే ఆమె ఒళ్లో బాన పొట్టతో బొజ్జున్న ముసలి భర్తఉన్నారు. ఆపైన అప్పరు బెర్తులో సాఫ్ట్‌వేర్ రంగంలో నిష్టాతులైన ఇద్దరుచలాకీ గుర్రాలంటి కుర్రాళ్లు ఉన్నారు. రైలు ఉదయం 6 గంటలకు విశాఖనుండి బయలుదేరింది. సరిగ్గా అది మధ్యాహ్నానికి విజయవాడచేరుకుంటుందని అనుకున్నాం. కాని ఉసూరుమంటూ నెమ్మదిగా ప్రయాణంమొదలైంది. రైలు బండి ఆగుతూ ,, సాగుతుండగా ఒకరితో ఒకరు మాటల సందడినెలకొంది. ఇంకే ముంది కథ మాములే కదా..మీరేం చేస్తారు..మీరేంచేస్తుంటారు అంటూ పలకరింపులు..అలా సంభాషణ కొనసాగుతుండగా..మధ్యలోఒకరు నేను విలేఖరి ఓ పెద్ద పేరుమోసిన పత్రిక(ఇక్కడ పేరు చెప్పడంఇష్టం లేదు) పేరు చెప్పాడు. బాబు నువ్వు ఆ పత్రికలో పనిచేస్తున్నావామంచిదే..! ఈనాడు మీకు జీతాలు చాలా బాగుంటాయి కదా..అంది మధ్యలోవయసుపైబడిన పెద్దావిడ. దీంతో మనోడు ఒక్కసారిగా కంగుతిన్నాడు .పేపరంటే పెద్దదే కాని జీతాలు బాగుంటాయంటదేంటి పిచ్చిది అనిమనస్సులో ఓ చిన్న తింగరిగా నవ్వుకుని, ఊ..ఊ అంటూ నీళ్లు నమిలాడుమనోడు. అదేంటి బాబు అలా మాట మింగుతావేంటి కనీసం ఓ 25 వేలైనాఉండదా..అని గట్టిగా అడిగే సరికి మనోడికి ఏం చెప్పాలో తెలియదు. మరీఅంత ఇవ్వడం లేదండి అంటూ ఎక్కడా ప్రెస్టేజ్ తగ్గకుండా, పర్వాలేదు.ఏదో అలా నడిచిపోతుంది అన్నాడు. ఇంతలో పెద్దావడి తోడైన బాన పొట్టపెద్దాయన కలుగజేసుకుని ఎందుకే అతడ్ని అలా తింటావ్..ఎందుకుండవుజీతాలు. ఈరోజుల్లో విలేకరంటే మాటలా..! వాళ్లకు చాలాడబ్బులొస్తాయి..వాళ్లదే రాజ్యమంతా అంటూ సముదాయించాడు సంభాషణని, ఏంఅబ్బాయి నేను చెప్పేది నిజమే కదా..? అనే సరికి కిక్కురుమనకుండాఉండిపోయాడు మన జర్నలిస్టు..ఏం చెప్పాలి..గొప్పగా చెప్పాలా..చేతిలోచిప్పపెడుతున్నారని చెప్పాలా..కొంత సేపు ఏమి మాట్లాడకుండా ఉండిపోయాడు.ఆపైన బెర్తులో ఉన్న కుర్రాళ్లు కూడా మేము జర్నలిజం బాట పడతాం సర్..మమ్ముల్ని గైడ్ చేయండి..ఈసాఫ్ట్ వేర్ ఉద్యోగంచేయలేకపోతున్నాం..అనగానే రైలు కూత వినిపించింది..నెమ్మదిగా రైలుఆగింది..స్టేషన్ ఆయేగి..అని హిందీ మాట వినిపించగానే..మనోడు చిన్నచిరునవ్వు నవ్వకుంటూ(మనస్సులో ఏలాగుంటుందో చెప్పనక్కర్లేదుగా)బై..బై అంటూ దిగేసాడు...ఆ తరువాత ఏముంటుంది..మళ్లీ మనోడి పురాకులుమాములే కదా..బతకనివ్వదు..దారి చూపదు..దీనమ్మా జీవితం..!...












