E-PAPER

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల అధికారిక ప్రకటన.

Date : 01 February 2026, 9:48 pm Posted By : PRAJA GONTHUKA

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల అధికారిక ప్రకటన.

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల అధికారిక ప్రకటన.

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డిమాట్లాడుతూచేర్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి దృక్పథాన్ని కేంద్రంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని స్పష్టం చేశారు.పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేర్యాల పట్టణం నిర్లక్ష్యానికి గురైందని, మౌలిక సదుపాయాలు క్షీణించాయని విమర్శించారు. మున్సిపాలిటీలో స్వచ్ఛ పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, పట్టణంలో ని కాంగ్రెస్ జెండాను గర్వంగా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు, పట్టణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్