*భక్తి శ్రద్ధలతో పాంబండ గిరి ప్రదర్శన..
కుల్కచర్ల,ప్రజా గొంతుక న్యూస్: వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని ఏకశిల పర్వతంగా పిలువబడిన పాంబండ పుణ్యక్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకొని గిరప్రదర్శన వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు.అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దాతలు భక్తులకు ప్రసాదం అందజేశారు.సుమారు రెండు కిలోమీటర్ల పొడవుతో కూడుకున్న పాంబండ గిరి చుట్టూ భక్తులు ప్రదక్షణ చేశారు.భక్తులు ఓం నమశ్శివాయ అనే శివ నామస్మరణతో పాపం బండ పుణ్యక్షేత్రం పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోయింది.ఈ కార్యక్రమంలో పాంబండ దేవాలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,గిరిప్రదక్షిణ నిర్వాహకులు ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,దేవాలయ కమిటీ సభ్యులు,పలువురు ముఖ్య ప్రముఖులు,వివిధ గ్రామాల నుండి వచ్చిన స్వామివారి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.












