E-PAPER

వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరు…..? 

Date : 01 February 2026, 6:16 pm Posted By : PRAJA GONTHUKA

వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరు…..? 

వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరు.....?

బిక్కుబిక్కు మంటున్న తల్లిదండ్రులు...

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరంటూ వాపోతున్నారు.. మల్లారం గ్రామంలో ఆదివారం రోడ్డుపై ఓ బాలుర ఆడుకుంటుంటే వీధి కుక్క దాడి చేసింది.. దీంతో బాలుడికి తొడ భాగంలో గాయమైంది.. సంబంధిత సబ్ సెంటర్లో ప్రాథమిక చికిత్స కోసం సందర్శించగా ఆదివారం కావడంతో టీకా అందుబాటులో లేదని తెలిసింది.. వెంటనే మండల కేంద్రంలోని డాక్టర్లను సంప్రదించగా, తొడ భాగంలో రక్తస్రావం కావడంతో, హిమోగ్లోబిన్ టీకా అవసరం ఉందని, అది మండల కేంద్రంలో అందుబాటులో లేదని డాక్టర్లు సమాచారం ఇచ్చారు.. తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురై, మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి బాలుడుని తరలించారు.. ఆదివారం అయినప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర టీకాలతో పాటు, కొంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు...

⬇ DOWNLOAD
×

వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరు…..?

బిక్కుబిక్కు మంటున్న తల్లిదండ్రులు…

ప్రజా గొంతుక భీమదేవరపల్లి:-

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.. వీధి కుక్కల దాడి నుంచి కాపాడేది ఎవరంటూ వాపోతున్నారు.. మల్లారం గ్రామంలో ఆదివారం రోడ్డుపై ఓ బాలుర ఆడుకుంటుంటే వీధి కుక్క దాడి చేసింది.. దీంతో బాలుడికి తొడ భాగంలో గాయమైంది.. సంబంధిత సబ్ సెంటర్లో ప్రాథమిక చికిత్స కోసం సందర్శించగా ఆదివారం కావడంతో టీకా అందుబాటులో లేదని తెలిసింది.. వెంటనే మండల కేంద్రంలోని డాక్టర్లను సంప్రదించగా, తొడ భాగంలో రక్తస్రావం కావడంతో, హిమోగ్లోబిన్ టీకా అవసరం ఉందని, అది మండల కేంద్రంలో అందుబాటులో లేదని డాక్టర్లు సమాచారం ఇచ్చారు.. తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురై, మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి బాలుడుని తరలించారు.. ఆదివారం అయినప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర టీకాలతో పాటు, కొంతమంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్