పోగొట్టుకున్న 16లక్షల విలువ గల బంగారాన్ని అందజేసిన వేలేరు పోలీసులు
ప్రజా గొంతుక డెస్క్(ఫిబ్రవరి 01)పోగొట్టుకున్న సుమారు 16 లక్షల రూపాయలు విలువగల 100 గ్రాముల బంగారు ఆభరణాలను తిరిగి బాధితులకు అందజేసిన వేలేరు పోలీసులు.
వేలేరు మండలం కేంద్రానికి చెందిన గంజి రమేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న మధ్యాహ్నం లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర కారులో బయలుదేరే క్రమంలో, మినరల్ వాటర్ ని ట్యాంక్ లో నింపుకునేందుకు, వాటర్ ట్యాంక్ ను తీసే క్రమంలో కారు డిక్కీలో ఉన్న బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు కిందపడిపోవడం జరిగింది. ఇది గమనించకుండా కారులో జాతరకు వెళ్లిపోయిన బాధితుడు, తిరుగు ప్రయాణంలో తన కారు డిక్కీలో బ్యాగు కనిపించకపోయేసరికి, కంగారుపడి బాధితుడు ఇంటిలో కూడా వెతకగా ఇంటిలో కనిపించకపోయేసరికి, ఎక్కడో రోడ్డు మార్గమధ్యలో పడిపోయినట్లుగా అనుమానించిన బాధితుడు ఈ రోజు ఉదయం వేలేరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, అప్రమత్తమైన పోలీసులు ఎస్సై సురేష్ కుమార్ ఆధ్వర్యంలో, స్థానిక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి. సదర్ రోడ్డుపై పడిపోయిన బంగారు ఆభరణాల బ్యాగును అక్కడే ఉన్న ఓ వ్యాపారి తీసుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు, అతని నుండి బంగారు ఆభరణాల బ్యాగ్ పోలీసులు స్వాధీనం.. చేసుకొని బాధిత దంపతులకు ఎస్.ఐ చేతుల మీదుగా బ్యాగ్ ను అందజేయడం జరిగింది. పోయిన బ్యాగ్ కోసం వేగంగా స్పందించి తిరిగి అందజేసిన వేలేరు పోలీసులకు భాదితులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.












