E-PAPER

కేసీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు.

Date : 01 February 2026, 5:16 pm Posted By : PRAJA GONTHUKA

కేసీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు.

కేసీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు.

. కాంగ్రెస్ కు ప్రజలే సరైన బుద్ధి చెప్తారు...

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 1) కాల్వ శ్రీరాంపూర్ :టిఆర్ఎస్ అధినేత,తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజస్వామిక,రాజకీయ కక్ష సాధింపులు చర్యలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కూడిన ర్యాలీ . కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి, కమాన్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, రహదారి పై కాంగ్రెస్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పై అనుచరిస్తున్న వ్యతిరేక రాజకీయ వేధింపులు, సరైన పద్ధతి కాదంటూ, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటేష్,వారి పోలీసు బృందం ధర్నా కార్యక్రమానికి చేరుకొని,ధర్నా ను విరమింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ పై ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా వేధిస్తున్నారని, ఆయనను అవమానిస్తూ, అమానుషంగా ప్రవర్తిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.కెసిఆర్ పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు... ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్,మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నాగరాజు, మోహన్ రాణి, మంథని రాజయ్య, గారడి అశోక్ లక్ష్మి, తీగల నాగరాజు, మాజీ సర్పంచులు బైరం రమేష్, దాసరి లావణ్య రమేష్, సిరికొండ కొమురయ్య, మాజీ ఎంపీటీసీలు కొల్లూరి రామ,రాయమల్లు, ఎండి ఇబ్రహీం, నూనెటి కుమార్, కుంభం రాజు, గొడుగు మల్లేష్, సదయ్య, వోడ్నాల శ్రీనివాస్, కుమారస్వామి రాజేష్, రాజయ్య, సువర్ణ బిట్టు, సాయి, తాత సాయి కిరణ్, తాండ్ర అనిల్, రవి, శ్రీకాంత్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

కేసీఆర్ పై ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు.

. కాంగ్రెస్ కు ప్రజలే సరైన బుద్ధి చెప్తారు…

ప్రజా గొంతుక (ఫిబ్రవరి 1) కాల్వ శ్రీరాంపూర్ :టిఆర్ఎస్ అధినేత,తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజస్వామిక,రాజకీయ కక్ష సాధింపులు చర్యలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన కూడిన ర్యాలీ . కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి, కమాన్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి, రహదారి పై కాంగ్రెస్ ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పై అనుచరిస్తున్న వ్యతిరేక రాజకీయ వేధింపులు, సరైన పద్ధతి కాదంటూ, ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల సమాచారంతో ఎస్సై వెంకటేష్,వారి పోలీసు బృందం ధర్నా కార్యక్రమానికి చేరుకొని,ధర్నా ను విరమింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ పై ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా వేధిస్తున్నారని, ఆయనను అవమానిస్తూ, అమానుషంగా ప్రవర్తిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.కెసిఆర్ పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు… ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్,మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నాగరాజు, మోహన్ రాణి, మంథని రాజయ్య, గారడి అశోక్ లక్ష్మి, తీగల నాగరాజు, మాజీ సర్పంచులు బైరం రమేష్, దాసరి లావణ్య రమేష్, సిరికొండ కొమురయ్య, మాజీ ఎంపీటీసీలు కొల్లూరి రామ,రాయమల్లు, ఎండి ఇబ్రహీం, నూనెటి కుమార్, కుంభం రాజు, గొడుగు మల్లేష్, సదయ్య, వోడ్నాల శ్రీనివాస్, కుమారస్వామి రాజేష్, రాజయ్య, సువర్ణ బిట్టు, సాయి, తాత సాయి కిరణ్, తాండ్ర అనిల్, రవి, శ్రీకాంత్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్