E-PAPER

కుక్క కాటు బాధితులకు తప్పని తిప్పలు

Date : 01 February 2026, 5:15 pm Posted By : PRAJA GONTHUKA

కుక్క కాటు బాధితులకు తప్పని తిప్పలు

కుక్క కాటు బాధితులకు తప్పని తిప్పలు

*ప్రజా గొంతుక ఫిబ్రవరి 1 డివిజన్ సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

ఏరియా ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజెక్షన్లు మరియు ఇతర అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి

పేదలకు అండగా ఉండాల్సిన ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు...

దేవరకొండ పట్టణంలోని మూడవ వార్డు శాలిబండ పరిధిలో గల అంజయ్య వెంచర్ వెళ్లే దారిలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. తండ్రీకొడుకులపై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో మొహమ్మద్ అబ్దుల్ గఫార్ (30), ఆయన కుమారుడు మొహమ్మద్ జహిద్ (7) తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కుక్క కాటుకు గురైన బాధితులను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు అక్కడి సిబ్బంది తీరుతో కోలుకోలేని షాక్ తగిలింది.

బాధితులు ఆసుపత్రికి చేరుకున్న సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అక్కడ ఉన్న నర్సులను సంప్రదించగా ఆసుపత్రిలో కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్లు (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) అందుబాటులో లేవని, పైగా మందుల సరఫరా కూడా నిలిచిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇక్కడ వైద్యం సాధ్యం కాదని ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే నల్గొండ లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏడేళ్ల బాలుడు నొప్పితో విలవిలలాడుతున్నా కనీస చికిత్స అందించకుండా పంపేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఇంజెక్షన్లు లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు అండగా ఉండాల్సిన ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజెక్షన్లు మరియు ఇతర అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

⬇ DOWNLOAD
×

కుక్క కాటు బాధితులకు తప్పని తిప్పలు

*ప్రజా గొంతుక ఫిబ్రవరి 1 డివిజన్ సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

ఏరియా ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజెక్షన్లు మరియు ఇతర అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి

పేదలకు అండగా ఉండాల్సిన ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు…

దేవరకొండ పట్టణంలోని మూడవ వార్డు శాలిబండ పరిధిలో గల అంజయ్య వెంచర్ వెళ్లే దారిలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. తండ్రీకొడుకులపై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో మొహమ్మద్ అబ్దుల్ గఫార్ (30), ఆయన కుమారుడు మొహమ్మద్ జహిద్ (7) తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కుక్క కాటుకు గురైన బాధితులను కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు అక్కడి సిబ్బంది తీరుతో కోలుకోలేని షాక్ తగిలింది.

బాధితులు ఆసుపత్రికి చేరుకున్న సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అక్కడ ఉన్న నర్సులను సంప్రదించగా ఆసుపత్రిలో కుక్క కాటుకు సంబంధించిన ఇంజెక్షన్లు (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) అందుబాటులో లేవని, పైగా మందుల సరఫరా కూడా నిలిచిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇక్కడ వైద్యం సాధ్యం కాదని ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే నల్గొండ లేదా హైదరాబాద్‌కు వెళ్లాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఏడేళ్ల బాలుడు నొప్పితో విలవిలలాడుతున్నా కనీస చికిత్స అందించకుండా పంపేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం ఇంజెక్షన్లు లేకపోవడంపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదలకు అండగా ఉండాల్సిన ఏరియా ఆసుపత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో కుక్క కాటు ఇంజెక్షన్లు మరియు ఇతర అత్యవసర మందులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్