*ఘనంగా ఆలయ వార్షికోత్సవం*
*ప్రజాగొంతుక (పాపన్నపేట,జనవరి 31)*
నార్సింగి గ్రామంలో శనివారం ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సీతా రాముల కళ్యాణం కన్నుల పండువగా సాగింది. అర్చకులు విశ్వనాథం శర్మ,నవీన్ శర్మ లు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.












