గ్రామ అభివృద్ధి పై ఆర్థిక అవగాహన.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలంలోని గురువన్నపేట గ్రామంలో దాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాకా తాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆర్థిక అవగాహన కల్పించడం, పొదుపు సంస్కృతిని పొందించడం, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొని రావటం లక్ష్యంగాసస్టైనబుల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ జహంగీర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఆర్థిక అవగాహన కీలకమని ప్రతి కుటుంబంలో పొదుపు అలవాట్లు పెంచుకొని, బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో బాధ్యతమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేష్ దాన్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ సస్టైనబుల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక భద్రత సామాజిక సమానత్వం మరియు అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామ కమిటీ సభ్యులు, మరియు గ్రామ పెద్దలు వివిధ స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు పాఠశాల హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పొదుపు బ్యాంకింగ్ సేవలు, వినియోగం, డిజిటల్ లావాదేవీలు,బీమా, రుణాల సద్వినియోగం వంటి అంశాలపై నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ధనుంజయ మరియు మకిలి నవీన్ డాన్ ఫౌండేషన్ ప్రతినిధులు మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












