రోడ్డు భద్రత వారోత్సవాలు.
ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ కూడలిలో రోడ్డు భద్రత నియమాలకు సంబంధించిన పంచతంత్ర పాఠశాల విద్యార్థులు ప్లే కార్డ్స్ పట్టుకొని స్లొగన్స్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని ఆయన అన్నారు. విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ మీ పేరెంట్స్ కు రోడ్డు భద్రత విషయాలు కచ్చితంగా పాటించేటట్టు చూడాలని ఆయన అన్నారు. హెల్మెట్ తప్పకుండా ధరించాలని ఆయన అన్నారు లేకుండా బయటికి రావద్దని పిలుపునిచ్చారు. కారులో వెళ్లేటప్పుడు సీట్ బిల్లు కచ్చితంగా పెట్టుకోవాలని ఆయన అన్నారు. రోడ్డు భద్రత విషయాల గురించి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు సిఐ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












