ప్రమాదవశత్తు మంటలు అంటుకొని ఇంట్లో సామాన్లు దగ్ధం.
ప్రజా గొంతుక (జనవరి 31) కాల్వ శ్రీరాంపూర్: ప్రమాదవశత్తు మంటలు అంటుకొని, నిత్యవసర సరుకులు బట్టలు దగ్ధం. లక్షల్లో నష్టం జరిగిందని బాధితుల అవేదన. ఈ ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గోపగోని మల్లేశ్వరి స్వామి దంపతులు, వారికి నూతన ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, నిర్మాణంలో భాగంగా, అదే గ్రామంలోని వేరే వారి ఇంట్లో కిరాయికి ఉంటున్నారు.వారు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు పనులకు వెళ్లి, తిరిగి కిరాయి ఉన్న ఇంటి రాగ, అప్పటికే మంటలు అంటుకొని ఇంట్లోని సరుకులు, బియ్యం,02 టివి లు, నిత్యవసర సామగ్రిలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఇంటి ఓనర్ కు సంబంధించిన కంగనహల్ సామాన్లు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు వాపోయారు. లక్షల్లో నష్టం జరిగిందని, ప్రభుత్వం పరంగా ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













