మృతదేహానికి నివాళులర్పించిన సర్పంచ్ ఎండి ఫిరోజ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో అనారోగ్యంతో తాడూరి కిష్టయ్య మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, మేమున్నామని మనోధైర్యాన్ని నింపి, ఆ పార్థివ దేహానికి సర్పంచ్ ఎండి ఫిరోజ్ నివాళులర్పించారు. అతను ఎక్కడ కలిసినా మాట్లాడే వ్యక్తి అని, మంచి వ్యక్తిని కోల్పోయామని బాధపడ్డారు. ఈ సందర్భంగా గట్టు మల్లేశం, వార్డు మెంబర్లు జూల నర్సింలు, తీగల రవి, ఆరే సతీష్, నాయకులు జూకంటి కిష్టయ్య, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.












