మృతుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం...
నేనున్నానంటూ మనో ధైర్యాన్నిస్తున్న సామాజికవేత్త , పోతుల రాములు యాదవ్
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో అనారోగ్యంతో తాడూరి కిష్టయ్య మృతి చెందడంతో విషయం తెలుసుకున్న సామాజికవేత్త పోతుల రాములు యాదవ్ వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి, నేనున్నానని భరోసా ఇచ్చి వారి కుమారుడు తాడూరి కర్ణాకర్ కు వెంటనే ఐదువేల రూపాయలు అందించారు. ఆ కుటుంబానికి ఏ ఆపాద కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అడగకుండానే ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించిన పోతుల రాములు యాదవ్ కు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తూ, రుణపడి ఉంటామని తెలియజేశారు. మండల నాయకులు రామీని మదన్మోహన్ ,వార్డ్ మెంబర్లు జూల నరసింహులు, తీగల రవి,అరె సతీష్, నాయకులు జూకంటి కిష్టయ్య,అచ్చయ్య, రేణిగుంట సత్తయ్య,నీల పాపయ్య, రేణిగుంట బాలరాజు, పరిదే కొమురయ్య, కానుగంటి నరసయ్య, కొయ్యడి సత్తయ్య, బుడిగా రామచంద్రం, రేణిగుంట యాదయ్య, పరిదే చిన్న కొమురయ్య, రేణిగుంట కిష్టయ్య, రేణిగుంట రామచంద్రం, తాడూరి కరుణాకర్, తాండూరి భాను, తరిగొప్పుల కరుణాకర్, మంత్రి సిద్ధులు,సత్తయ్య, సురేష్, ఆరె సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.













