E-PAPER

బ్యాంకు అధికారి వేణుగోపాలరావు ఆత్మహత్య

Date : 30 January 2026, 8:59 pm Posted By : PRAJA GONTHUKA

బ్యాంకు అధికారి వేణుగోపాలరావు ఆత్మహత్య

బ్యాంకు అధికారి వేణుగోపాలరావు ఆత్మహత్య

ఆందోళనలో తోటి ఉద్యోగులు

ప్రజా గొంతుక న్యూస్ జనవరి 28/ కొత్తగూడెం: ఉన్నత అధికారుల వేధింపులు, మెమోల జారీతో మనోవేదనకు గురై తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ (TGVB) అసిస్టెంట్ మేనేజర్ వేణుగోపాలరావు (37) బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో పనిచేసిన కాలంలో మంజూరు చేసిన రుణాల బకాయిల విషయంలో అధికారులు మెమోలు ఇవ్వడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తన మరణానికి కొందరు అధికారులే కారణమని ఆయన రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.ఈ ఘటనకు నిరసనగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం విద్యానగర్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. వేణుగోపాలరావు మరణానికి కారణమైన అధికారులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్