బిజ్వారం లో ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం దగ్గర స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బిజ్వారం గ్రామ నెహ్రూ యువజన సంఘం సీనియర్ నాయకుడు కె.రఘు మాట్లాడుతూ...సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాదిభారతీయులకుస్వేచ్చా,స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు టి.లక్ష్మీ, పార్వ తమ్మ,ఆశవర్కర్ లు జగదీశ్వర మ్మ, భారతి,జ్యోతి, గ్రామ పంచాయతీ సిబ్బంది బుడ్డన్న,గోవిందు పాల్గొన్నారు.












