గాంధీజీ వర్ధంతి సందర్భంగా కొమురవెల్లిలో ఘన నివాళులు.
ప్రజా గొంతుక కొమురవెల్లి : మండలకేంద్రంలోని జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం మహదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ, జీవితం మనకు ధైర్యం, సహనం, మానవత్వం నేర్పిన అమూల్యమైన పాఠమని, గాంధీ ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరించడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గాంధీవర్ధంతి సందర్భంగా నిర్వహించే ‘అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్, కొమురవెల్లి టౌన్ అధ్యక్షుడు లింగంపల్లి కనకరాజు, డైరెక్టర్ బత్తిని నరసింహులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.












